నెయ్యి శీతల గుణం కలదే గాక కొంత తీపి రుచి కలిగి ఉంటుంది. నెయ్యి ఆరోగ్యాన్ని కలిగిస్తే ఆయుష్షుని కూడా పేంచే గుణం నెయ్యికి ఉంది. బలవర్థకమేకాక మేధస్సును తేజోవంతం చేస్తుంది ఇది కఫయుక్త రుగ్మతలకు ఉపయోగకరమైంది. సౌందర్యాన్ని ఇనుమడించచేయడమే కాకుండా తేజస్సును, ఉత్సాహాన్ని, కాంతిని అధికం చేస్తుంది. నేత్రాలకు హితకరం, వాతపిత్తాలకు నెయ్యి ఉపశమింప చేస్తుంది. పిచ్చి (ఉన్నాదం) శూల( నొప్పి) కడుపుబ్బరం, కడుపెలో తిప్పట, దేవడం, సాధారణ జ్వరము, లాంటి రుగ్మతలను ఉపశమనం కలిగిస్తుంది. క్షయ, రక్త ధోషాలను నివారిస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: